తొలిసారి బ్రాహ్మణ అబ్బాయిగా వేషం కట్టి .. అంటే సుందరానికి అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు సరికొత్త గా పలకరించటానికి సిద్దం అయ్యారు నాని. ఇక ఈ సినిమాలో చాలా కొత్తగా బ్రాహ్మణ అబ్బాయి గా కనిపించి ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా నుంచి పాటలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా అందుకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్ పంచకట్టు పాట ఈరోజు సాయంత్రం 6:03 గంటలకు విడుదల చేయనున్నారు చిత్రం యూనిట్. ఇక ఈ పాట తో ప్రేక్షకులను ఎలా అలరిస్తారని నాని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాతో మళ్లీ విజయాన్ని సొంతం చేసుకోవాలని నాని అభిమానులు గాఢంగా కోరుకోవడం గమనార్హం. ఇక నాని ఎక్కడ ఉన్నా సరే చాలా సహజంగా ఉండడమే కాదు పెద్ద పెద్ద స్టార్ హీరోలతో కూడా నాచురల్ స్టార్ గా పిలిపించుకున్నారు. ఇక బాలయ్య లాంటి స్టార్ హీరో కూడా ప్రజల హీరో అంటూ కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక నాని తన కెరియర్ లో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి