ఈమూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కష్ట పడ్డాడు. అంతేకాదు తన విలువైన మూడున్నర సంవత్సరాల కాలాన్ని ఈమూవీ కోసం ఉపయోగించాడు. అయితే చరణ్ తో పోల్చుకుంటే జూనియర్ కు ఈమూవీ ద్వారా పాన్ ఇండియా ఇమేజ్ ప్రత్యేకంగా ఏమిలేకపోవడంతో తారక్ లోలోపల కొంత మధన పడుతున్నాడు అన్నవార్తలు ఇప్పటికే వచ్చాయి.
రాజమౌళి ఈమధ్య ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమూవీలో నటించిన తారక్ చరణ్ లు గురించి మాట్లాడుతూ ఈమూవీకి సంబంధించి తారక్ నటించిన కొమరం భీమ్ పాత్ర లేకపోతే ‘ఆర్ ఆర్ ఆర్’ అంత ఘన విజయాన్ని సాధించి ఉండేది కాదు అంటూ జక్కన్న కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ‘కొమరం భీముడో’ అంటూ వచ్చే పాటలో జూనియర్ చూపించిన హావభావాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏనటుడు చూపించలేడనీ జక్కన్న జూనియర్ ను ఆకాశానికి ఎత్తేశాడు.
వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ 1000 కోట్ల కలక్షన్స్ మార్క్ ను అందుకుంటుంది అన్నప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ కలక్షన్ ఫిగర్స్ లో ఏదోతేడా ఉంది అంటూ మీడియాలోని కొన్ని వర్గాలు నెగిటివ్ ప్రచారం చేస్తున్నాయి. అయితే మరికొందరు మాత్రం కరోనా పరిస్థితులు తరువాత తిరిగి సినిమాలు 1000 కోట్ల కలక్షన్స్ ను చూస్తాయా అన్న సందేహాలకు ‘ఆర్ ఆర్ ఆర్’ గట్టి సమాధానమే ఇచ్చిందని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఎలా ఉన్నా జూనియర్ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో బాలీవుడ్ మీడియాలో ప్రముఖ వ్యక్తిగా మారాడు అని అనుకోవడంలో సందేహం లేదు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి