‘కేజీ ఎఫ్ 2’ బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ప్రశాంత్ నీల్ కు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. యాక్షన్ సెంటిమెంట్ ఎలిమెంట్స్ ను చాల చక్కగా హ్యాండిల్ చేస్తూ ప్రశాంత్ నీల్ ‘కేజీ ఎఫ్ 2’ ను తీయడంతో ఈమూవీ విడుదలైన అన్ని రాష్ట్రాలలోను విజయంసాధించి అన్నిప్రాంతాల వారికి నచ్చిన రియల్ బ్లాక్ బష్టర్ గా మారింది.


ప్రస్తుతం ప్రశాంత్ నీల్ టాప్ ఇండియన్ సెలెబ్రెటీగా మారిపోవడంతో ఇప్పుడు అతడిని అభినందిస్తూ టాప్ హీరోలు అంతా అతడికి మెసేజ్ లు పెడుతూ ఫోన్స్ చేస్తూ ప్రశాంత్ నీల్ దృష్టిలో పడటానికి ప్రయత్నిస్తున్నారు. సెలెబ్రెటీలు అంతా ఆవిధంగా ప్రయత్నిస్తూ ప్రశాంత్ నీల్ దృష్టిలో పడటానికి ప్రయత్నిస్తూ ఉంటే ప్రశాంత్ నీల్ దృష్టి మాత్రం ప్రిన్స్ మహేష్ పై ఉన్నట్లు అర్థం అవుతోంది.


ఈమూవీని చూసి తనను ఎంతోమంది అభినందించినప్పటికీ తనకు మహేష్ నుండి వచ్చిన ఫోన్ కాల్ ఎంతో స్పూర్తిని ఇచ్చింది అంటూ కామెంట్స్ పెట్టాడు. దీనితో మహేష్ ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్ లో మూవీ ఉండటం ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి. గతంలో ప్రశాంత్ నీల్ మహేష్ తో ఒక సినిమా చేయాలని చాల గట్టిగా ప్రయత్నించాడు. అయితే ఆ ప్రాజెక్ట్ చర్చల వరకే పరిమితం అయింది.


అప్పట్లో మహేష్ కు ప్రశాంత్ నీల్ చెప్పిన కథకు కొన్ని మార్పులు చేర్పులు చేసి అదే కథను ఇప్పుడు ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ ‘సలార్’ గా తీస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రశాంత్ నీల్ సినిమాలలో హీరోలు చాల కష్టపడాలి. త్వరలో మహేష్ రాజమౌళి సినిమా కోసం బాగా కష్టపడబోతున్నాడు. ఆసినిమా ఎప్పుడు పూర్తి అవుతుందో మహేష్ కు కూడ తెలియని పరిస్థితి దీనితో ప్రశాంత్ నీల్ మహేష్ ల ప్రాజెక్ట్ ఇప్పట్లో ప్రారంభం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి: