ఈనెలాఖరున విడుదలకాబోతున్న ‘ఆచార్య’ మూవీ ప్రమోషన్ ను రామ్ చరణ్ ప్రారంభించి అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈసినిమాలో తాను తన తండ్రి చిరంజీవితో కలిసి నటించినప్పుడు తనకు కలిగిన భావోద్వేగాన్ని అదేవిధంగా దర్శకుడు కొరటాల తో తనకు ఏర్పడిన అనుబంధం పై అనేక ఆసక్తికర కామెంట్స్ చేసాడు.


ఇప్పటివరకు తాను అనేకమంది దర్శకుల వద్ద పనిచేసినప్పటికీ కొరటాల వర్కింగ్ స్టైల్ వేరు అంటూ కామెంట్స్ చేసాడు. ఒక సీన్ ను కొరటాల వివరించి ఆ సీన్ లో ఎలా నటించగలవో మూడు రకాలుగా చూపించమని అడుగుతాడని అలా నటించి చూపించిన తరువాత ఆ సీన్ కు సంబంధించి ఆనటుడు నటించి చూపించిన మూడు రకాల డైలాగ్ ఎక్స్ ప్రెషన్స్ లో తనకు నచ్చిన ఎక్స్ ప్రెషన్ ను ఎంచుకుని దానికి మెరుగులు దిద్దుతాడు అంటూ కొరటాల టెక్నిక్ ను బయటపెట్టాడు.


గతంలో కొరటాల మహేష్ తో ‘శ్రీమంతుడు’ మూవీ చేసినప్పుడు అదేవిధంగా జూనియర్ తో ‘జనతాగ్యారేజ్’ చేసినప్పుడు ఇదే టెక్నిక్ అవలంభించానని కొరటాల తనకు చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అందువల్లనే మహేష్ జూనియర్ లు ఆసినిమాలలో తమ పాత్రలలో ఒదిగిపోయి పేరు తెచ్చుకున్నారని అంటూ ‘ఆచార్య’ లో తాను నటించిన సిద్ధ పాత్రలో ఆపాత్ర కనిపిస్తుంది కానీ తాను కనిపించను అని అంటున్నాడు.


సాధారణంగా టాప్ హీరోలు మరో టాప్ హీరో చేసిన పాత్రల పై పెద్దగా ప్రశంసలు కురిపించరు. అయితే చరణ్ మాత్రం దీనికి భిన్నంగా జూనియర్ మహేష్ లు వివిధ సినిమాలలో చేసిన పాత్రల పై ప్రశంసలు కురిపిస్తూ తాను మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాను ఆమూవీలోని అతడి బాడీ లాంగ్వేజ్ ని చాల సార్లు నిశితంగా పరిశీలించిన విషయాన్ని బయటపెట్టాడు. ఇక ‘ఆచార్య’ మూవీలో తాను చిరంజీవితో కలిసి నటించిన సీన్స్ కు సంబంధించి షూటింగ్ ఆఖరిరోజున తాను తన తండ్రి చిరంజీవిని కౌగలించుకుని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకుని ‘ఆచార్య పై అంచనాలు పెంచుతున్నాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: