ఫిలిం ఇండస్ట్రీలో చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ప్రభాస్ మహేష్ జూనియర్ లు తమ నిర్మాతల నుండి కనీసం 30 కోట్లకు పైగా పారితోషికం తీసుకోవడం ఒక అలవాటుగా మారింది అన్న మాటలు వినిపిస్తిన్నాయి. ఇక చిరంజీవి పవన్ లు అయితే తాము నటించే సినిమాలకు 50 కోట్ల పారితోషికం ఉంటేనే వారు స్పందిస్తున్నారు అన్న టాక్ కూడ ఉంది.


అయితే ఈ విషయంలో నందమూరి సింహం బాలకృష్ణ రూట్ సపరైట్. బాలయ్య ఇప్పటివరకు 107 సినిమాలు నటించినా తన సినిమాలకు సంబంధించి పారితోషికాన్ని మిగతా టాప్ హీరోలు లా పెద్దగా ఆశించడు అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. గత సంవత్సరం డిసెంబర్ లో విడుదలై అఖండ విజయం అందుకున్న ‘అఖండ’ మూవీ తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.


‘అఖండ’ సినిమాకు బాలయ్య 10 కోట్లు పారితోషికం తీసుకోవడంతో మైత్రీ మూవీస్ నిర్మాతలు తమ లేటెస్ట్ మూవీకి 15 కోట్లు పారితోషికం బాలయ్యకు ఇవ్వాలని అనుకున్నారట. అయితే బాలకృష్ణ తన పారితోషికానికి అదనంగా మరొక కోటి చేర్చి 11 కోట్లు ఇస్తే చాలని చెప్పడమే కాకుండా అనవసరంగా ఖర్చు పెంచి నష్టపోవద్దు అని సలహా ఇచ్చాడట.


దీనితో ఆనందపడ్డ మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మాతలు తమకు తెలిసిన నిర్మాతలు అందరికీ ఈవిషయాన్ని ఫోన్ చేసి చెపుతూ పారితోషికం విషయంలో ఎటువంటి ఇబ్బందిని గురి చేయని బాలకృష్ణతో సినిమాలు చేసుకుంటే మంచిది అంటూ తమకు తెలిసిన నిర్మాతలకు బాలయ్య పేరును సూచిస్తున్నారట. వాస్తవ సంఘటనలు ఆధారంగా తీయబడుతున్న బాలయ్య లేటెస్ట్ మూవీలో శృతిహాసన్ ను హీరోయిన్ గా పెట్టే విషయంలో కూడ అబాలయ్య ఆమూవీ నిర్మాతలకు ఎవరికీ ఎక్కువ పారితోషికాలు ఇచ్చి నష్టపోవద్దు అని గట్టి సూచనలు ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలలో గుస గుసలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: