సినిమాకి టైటిల్ పెట్టడం అంటే చలా కష్టమైన పని... ఎందుకంటే సినిమా టైటిల్ కథను అద్దం పట్టేలా ఉండాలి. అర్థవంతంగా, మనసుకు దగ్గరగా, ఆహా అనిపించే అనుభూతిని ఇచ్చేదిగా ఉంటేనే ఆ సినిమా టైటిల్ ముందుగా ప్రేక్షకుల వరకు వెళుతుంది. కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాక గుర్తింపు తెచ్చుకుని అందరి మనసును గెలుచుకుంటే మరికొన్ని చిత్రాలు ఆసక్తికర టైటిల్ తో ముందుగానే ప్రజల మనసును దోచేస్తాయి. స్టార్ హీరోల చిత్రాలు అయినా... టైటిల్స్ ఎపుడు కూడా ఫస్ట్ ఇంప్రెషన్ గా నిలుస్తాయి. అందుకే టైటిల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు దర్శక నిర్మాతలు. హీరోలు కూడా టైటిల్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపుతుంటారు. అయితే ఈ క్రమం లో తమ చిత్రాలకు హైప్ తీసుకొచ్చేందుకు, లేదా తమ కథకు సూట్ అట్టే విధంగా ఇలా పలు కారణాల వలన ఆల్రెడీ హిట్ అయిన సినిమా పేర్ల ను రిపీట్ చేస్తూ ఉంటారు.

ఇదే తరహాలో చాలా సినిమా టైటిల్స్ మళ్ళీ రిపీట్ అయ్యాయి. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి చిత్రాల టైటిల్స్ కూడా చాలానే తిరిగి రిపీట్ అయ్యాయి. చిరు సినిమాలకు ఉండే క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ టైటిల్ ను చాలా మంది దర్శకులు తమ సినిమాల కోసం వాడేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలకు చిరు టైటిల్స్ రిపీట్ కాగా ఇపుడు మరో చిరు టైటిల్ తో యంగ్ హీరో చిత్రం తెరకెక్కుతోంది. రుద్రవీణ టైటిల్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఓ యంగ్ హీరో.  మధుసూధన్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కొత్త నటీనటులు పరిచయం కానున్నారు. తన ఊరుబాగు కోసం పాటు పాడే ఓ యువకుడి కథతో వస్తున్న చిత్రం ఇది.

అప్పటి మెగాస్టార్ చిత్రం రుద్రవీణ సినిమాకి మచ్చ రానీయకుండా ఉండేలా ఈ సినిమాను చాలా జాగ్రత్తగా రూపొందిస్తామని చెప్పుకొచ్చారు దర్శక నిర్మాతలు.  అయితే ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది అన్నది చూడాలి.  ఇప్పటి వరకు చిరు చిత్రాల టైటిల్స్ 15 కు పైగానే రిపీట్ కాగా అందులో చాలా వరకు నిరాశ పరచగా కొన్ని మాత్రం బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. మరి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: