దేశం మొత్తం మెచ్చిన ప్రముఖ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ అలియాస్ కేకే నిన్న కోల్కతాలో జరిగిన ఒక లైవ్ షోకి వెళ్లి దురదృష్టవశాత్తూ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఇతనికి ఉన్న అభిమానులు చాలా బాధపడుతున్నారు. ఇతను మాములుగా బాలీవుడ్ లో ఎక్కువ పాటలు పాడుతుంటాడు. కానీ భారతదేశంలో ఉన్న అన్ని సినిమా భాషలలోనూ పాటలు పాడి ప్రత్యేకతను సంతరించుకున్నాడు. కేవలం ఒక్క హిందీ బాషలోనే 200 కు పైగా పాటలు పాడాడు. ఇక తెలుగులో అయితే మంచి సూపర్ హిట్ సాంగ్స్ ను పాడాడు. దాదాపు టాప్ హీరోలు అందరికీ పాటలు పాడిన ఘనత కేకే ది అని చెప్పాలి. వీరిలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్, మహేష్ బాబు, నాగార్జున, ఎన్టీఆర్ ల సినిమాలకు పాడాడు.

దీనితో రెండు రోజులుగా సినిమా పరిశ్రమ విషాదంలో మునిగిపొయింది. ఈయనకు ఇప్పటికే దేశ ప్రధాని మోదీ తో పటు పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియచేశారు. కాగా కేకే గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి ఒక సింగర్ గా కేకే ఎంత సంపాదించాడు ? మరియు ఒక పాట పాడినందుకు గానూ ఎంత తీసుకుంటాడు ? అన్న రెండు విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం కేకే ఒక పాటను పాడినందుకు 5 నుండి 6 లక్షల వరకు పారితోషికంగా తీసుకుంటాడట.

అయితే సినిమా పాటలు పాడడం మాత్రమే కాకుండా.. లైవ్ ప్రదర్శనలు కూడా ఇవ్వడం కేకే కు వెన్నతో పెట్టిన విద్య. ఇలా ఒక్కో లైవ్ ప్రదర్శనలో పాడినందుకు గాను దాదాపుగా 10 నుండి 15 లక్షలు తీసుకునేవారని తెలుస్తోంది. ఇక కేకే ఇలా సంపాదించిన ఆస్తి మొత్తం 50 కోట్ల వరకు ఉంటుందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇక ఈయనకు భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం కేకే వయసు 53 సంవత్సరాలు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: