టాలీవుడ్ క్రేజీ హీరో లలో ఒకరు అయిన అడవి శేషు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మేజర్ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . శశికిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో శోభితా ధూళిపాళ , సాయి మంజ్రేకర్ కీలకమైన పాత్రలో నటించగా , ప్రకాష్ రాజు ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలో నటించాడు . మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అదిరి పోయే కలెక్షన్ లను ఆదుకుంటుంది. మరి మేజర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది . ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసు కుందాం .

నైజాం : 5.72 కోట్లు .
సీడెడ్ : 1.42 కోట్లు .
యూ ఎ : 1.57 కోట్లు .
ఈస్ట్ : 1.05 కోట్లు .
వెస్ట్ : 69 లక్షలు .
గుంటూర్ : 82 లక్షలు .
కృష్ణ : 78 లక్షలు .
నెల్లూర్ : 54 లక్షలు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నాలుగు రోజు లకు మేజర్ సినిమా 12.59 కోట్ల షేర్ , 21.10 కోట్ల గ్లాస్ కలెక్షన్ లను వసూలు చేసింది .
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 1.35 కోట్లు .
హిందీ మరియు ఇతర భాషలలో  2.70 కోట్లు.
ఓవర్ సీస్ లో : 4.90 కోట్లు .


ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజులకు మేజర్ సినిమా 21.54 కోట్ల షేర్ , 39.50 గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది .

మరింత సమాచారం తెలుసుకోండి: