పవన్ కళ్యాణ్ సినిమాలు రాజకీయాలు మధ్య రెండు పడవల ప్రయాణం కొనసాగిస్తూ ప్రతిరోజు ఎదోఒక సంచలన వార్తకు చిరునామాగా కొనసాగుతున్నాడు. పవన్ నటించ వలసి ఉన్న సినిమాల సంఖ్య పెరిగిపోతూ ఉంటే ఆసినిమాలను పక్కకు పెట్టి వచ్చే దసరా నుండి పవన్ బస్సు యాత్ర చేయబోతున్నాడు అని ఓపెన్ గా ప్రకటించడంతో పవన్ నటిస్తున్న ఈ సినిమాలు అన్నీ ఎప్పటికి పూర్తి అవుతాయి అన్న కన్ఫ్యూజన్ అందరిలోనూ ఉంది.


ఈ పరిస్థితులు ఇలా ఉండగా పవన్ సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించవలసి ఉన్న ‘వినోద సహితం’ రీమేక్ షూటింగ్ జూలై నుంచి మొదలుకాబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి స్క్రీన్ ప్లేతో పాటు సంభాషణలు కూడ త్రివిక్రమ్ అందిస్తున్నాడు.


ఈమూవీలో పవన్ కొన్ని అద్భుత శక్తులు ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడట. ఈమూవీలో పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కు కూడ కీలక పాత్ర ఉంది. అయితే ఈమూవీకి సంబంధించి పవన్ తో సాయి ధరమ్ తేజ్ కు చాల కాంబినేషన్ సీన్స్ ఉన్న నేపధ్యంలో పవన్ తేజ్ ను 4నెలల పాటు తాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఈమూవీ షూటింగ్ కు అందుబాటులో ఉండాలని కండిషన్ పెట్టినట్లు టాక్.


పవన్ ఈమూవీలో నటించవలసిన డేట్స్ కేవలం 30 రోజులు మాత్రమే అని తెలుస్తోంది. ఈ 30 రోజులకు పవన్ కు రోజుకు 2కోట్లు చొప్పున 60కోట్లు ఈమూవీ నిర్మాతలు ఇవ్వబోతున్నారు అన్న ప్రచారం కూడ జరుగుతోంది. సముధ్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈమూవీలో పవన్ పాత్రకు సంబంధించిన సంభాషణలు కొంత వేదాంత ధోరణితో ఉంటాయని అంటున్నారు. ఒకవైపు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొంటూనే మరొకవైపు సముద్రఖని మూవీని అక్టోబర్ లోపు పూర్తి చేసి దసరా నుండి బస్సు యాత్ర మొదలుపెట్టి తన సత్తా చూపెట్టాలని పవన్ ఉబలాట పడుతున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: