కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు పైన శివ కార్తీకేయన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . శివ కార్తికేయన్, కీర్తి సురేష్  హీరోయిన్ గా తెరకెక్కిన రేమో మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు .

ఆ తర్వాత శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన అనేక సినిమాలు తెలుగు లో డబ్ అయ్యి మంచి మంచి విజయాలు సాధించాయి . అందులో భాగంగా తాజాగా శివ కార్తికేయన్ నటించిన డాక్టర్ , డాన్ మూవీ లు రెండు కూడా తమిళ్ పాటు తెలుగు లో కూడా విడుదల అయ్యి , బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి . ఇలా ఇప్పటికే తమిళంలో నటించిన సినిమాలతో తెలుగు లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న శివ కార్తికేయన్ తాజాగా తెలుగు క్రేజీ దర్శకులలో ఒకరైన అనుదీప్ కే వి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రిన్స్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ మూవీ ని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది . ఈ మూవీ లో సత్యరాజ్ ఒక కీలక పాత్రల్లో కనిపించబోతున్నాడు .

ఇది ఇలా ఉంటే ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం .  ఈ సినిమాను తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు . ఈ సినిమాకు సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: