ప్రస్థుతం పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు అన్నింటికీ ఒకేఒక్క సమస్య. ధియేటర్లకు జనం క్రితంలా ఎలా రప్పించాలి అన్న విషయం పైనే చర్చలు దీనికోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితం కనిపించక చాల సినిమాలు శుక్రువారం విడుదలై ఆదివారంనాడు కలక్షన్స్ విషయంలో ముగిసిపోయే సినిమాలుగా మారుతున్నాయి.


దీనితో రిలీజ్ అయిన 95 శాతం సినిమాలు నష్టాల బాట పడుతున్నాయి. ఈసమస్యకు పరిష్కారాలు వెతకాలని తలలు పండిన ఇండస్ట్రీ మేధావులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏ ఆలోచన పరిష్కార మార్గాన్ని చూపెట్టలేకపోతోంది. ఈవిషయం పై దర్శకుడు రాజమౌళి విభిన్నంగా స్పందించాడు. ‘మత్తు వదలరా’ సినిమా దర్శకుడు నితీష్ రానా లావణ్య త్రిపాఠి ని మెయిన్ హీరోయిన్ గా పెట్టి తీసిన ‘హ్యాపీ బర్త్ డే’ మూవీ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ కు అతిధిగా వచ్చిన రాజమౌళి కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేసాడు.


చాలామంది ప్రేక్షకులు ధియేటర్లకు రావడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్న విషయం గురించి మాట్లాడుతూ ఆఫ్ హార్టెడ్ ప్రయత్నాలతో ఏపని చేసినా సక్సస్ ఉండదని అందువల్ల తీసే సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా నచ్చడా అన్న విషయం పక్కకు పెట్టి ఎదో ఒకటి తీస్తే చెల్లిపోయే రోజులు పోయాయి అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు కామెడీ సినిమా అయినా యాక్షన్ సినిమా అయినా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా అయినా ఇలా సినిమా తీసినా జనం చూస్తారని అయితే మారిన ప్రేక్షకుల అభిరుచిని పట్టించుకోకుండా సినిమాలు తీస్తే ప్రేక్షకులు వెంటనే తిప్పికొడతారు అంటూ అభిప్రాయ పడ్డాడు.


ఒకవైపు ఓటీటీ సినిమాలు మరొక వైపు వెబ్ సిరీస్ లు దాటుకుని ప్రేక్షకులు ధియేటర్ల వైపు రావాలి అంటే ఆసినిమాలో ఎదోఒక కొత్త విషయం ఉండాలి అని అలా కాకుండా సినిమాలు తీస్తే ఎవరు తీస్తారు అంటూ రాజమౌళి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి..  





మరింత సమాచారం తెలుసుకోండి: