నాగచైతన్య కెరియర్ ఒక హిట్ వస్తే మూడు ఫ్లాప్ లుగా కొనసాగుతోంది. దీనితో చైతూ మార్కెట్ పెరగడంలేదు. మాస్ హీరోగా రాణించాలని ప్రయత్నాలు చేసి విఫలం చెందిన నాగచైతన్య తిరిగి యూటర్న్ తీసుకుని ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ‘థాంక్యూ’ మూవీ ద్వారా చేసాడు.



అక్కినేని కుటుంబానికి వారి నిజ జీవితంలో మర్చిపోలేని ‘మనం’ లాంటి ఒక అద్భుతమైన మూవీని ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కుమార్ అంటే నాగార్జున కు ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానంతోనే గతంలో అఖిల్ తో తీసిన ‘హలో’ మూవీ ఫెయిల్ అయినప్పటికీ మళ్ళీ నాగచైతన్య విక్రమ్ కుమార్ కు అవకాశం ఇచ్చాడు. దిల్ రాజ్ నిర్మాత కాబట్టి ఈమూవీ కనీసం మినిమం గ్యారెంటీ హిట్ అవుతుందని చైతూ భావించాడు.



అయితే జరిగింది వేరు ఈమూవీ మరీ స్లోగా ఉండటంతో పాటు కథ కూడ ‘ప్రేమమ్’ మూవీని పోలి ఉండటంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఈమూవీకి కనీసపు కలక్షన్స్ కూడ రాకపోవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. ఈమూవీ విడుదల రోజున నాగార్జున చైతన్యకు ఈమూవీ యూనిట్ సభ్యులకు కనీసం బెస్ట్ విషస్ చెపుతూ సోషల్ మీడియాలో ట్విట్ చేయకపోవడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు ఈమూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు నాగార్జునను అతిధిగా పిలవాలని దిల్ రాజ్ ప్రయత్నించినప్పటికీ ఏవో కారణాలు చెప్పి నాగార్జున్ రాలేదు అని అంటారు.



దీనితో ఈమూవీ ఫలితం నాగార్జున ముందుగానే ఊహించాడ అంటూ మరికొందరి కామెంట్స్. ఈసినిమా నిరాశ పరిచినప్పటికీ వచ్చేనెల చైతన్య అమీర్ ఖాన్ తో నటించిన బాలీవుడ్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల కాబోతోంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అమీర్ ఖాన్ కు హిట్స్ ఉండటంలేదు. దీనితో ఆ నెగిటివ్ సెంటిమెంట్ మళ్ళీ అమీర్ ఖాన్ ను వెంటాడితే ఈమూవీ పై అదేవిధంగా బాలీవుడ్ ఎంట్రీ పై ఆశలు చైతన్య కు మరొకసారి నిరాశపడే ఆస్కారం ఉంది..




మరింత సమాచారం తెలుసుకోండి: