పాన్ ఇండియా సినిమా అంటే ఆ రేంజ్ లో రీచ్ తెప్పించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇతర భాషల ప్రేక్షకులు ఆ సినిమా ను ఓన్ చేసుకునేలా తదరు దర్శకుడు ఏదైనా చేయాలి.


డబ్బింగ్ సినిమా అనే ఫీలింగ్ రాకుండా పాటలు, డైలాగ్స్, నేటివిటీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఇతర భాషలకు చెందిన సినీ అభిమానులు కనెక్ట్ అవుతారు. 'బాహుబలి', 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్2' లాంటి సినిమాల విషయంలో ఆయా చిత్ర దర్శకనిర్మాతలు ఎంతో శ్రద్ధ తీసుకున్నారట.


అందుకే ఆ సినిమా లు జనాలకు అంతగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఈ సినిమాలను బాగా ఆదరించారు. అయితే ఇలా ఇతర భాషల సినీ అభిమానులను మెప్పించడం లో తమిళ ఫిలిమ్ మేకర్స్ ఫెయిల్ అవుతున్నారనే చెప్పాలి. తమిళంలో 'బాహుబలి' రేంజ్ సినిమాగా ప్రొజెక్ట్ చేస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' సినిమాపై పెద్దగా బజ్ రావడం లేదట.ఇప్పటివరకు విడుదలైన ప్రోమోలు, పోస్టర్స్ ఇలా అన్నింటి విషయంలో నేటివిటీ గుప్పుమంటోంది.


 


వేరే భాషలకు తగ్గట్లు పేరు మార్చాలని మణిరత్నం అండ్ కో అనుకోవడం లేదు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి 'పొంగే నది' అంటూ ఒక పాటను లాంచ్ చేశారు. తెలుగు లిరిక్స్ అనంత్ శ్రీరామ్ రాశారు. ఎంతో చక్కగా ఆయన రాశారు. కానీ రెహమాన్, మరో సింగర్ కలిసి ఆ పాటను ఖూనీ చేశారు. పాట మొత్తం తమిళ వాసనతో నింపేశారు. పైగా రెహమాన్ తెలుగు పదాలను నోటికొచ్చినట్లు పలకడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయట..


 


కనీసం తెలుగు భాష తెలిసిన వాళ్లతోనైనా పాడించాల్సింది లేదంటే శ్రద్ధ పెట్టి ఉచ్చారణ చక్కగా చేయాల్సింది. అలా కాకుండా పాటను ఖూనీ చేసేయడాన్ని భాషాభిమానులు తప్పుబడుతున్నారట. ఈ మాత్రం శ్రద్ధ పెట్టనప్పుడు సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎలా ఓన్ చేసుకుంటారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయట..

మరింత సమాచారం తెలుసుకోండి: