
వెంకటేష్ హీరోగా నటించిన ధర్మచక్రం అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా పరిచయమైంది ప్రేమ. కన్నడ అమ్మాయి అయిన ఈ అమ్మడు చిన్నవయసులోనే అక్కడ పాపులారిటీ రావడంతో తెలుగులో ఎంతో త్వరగానే అయ్యే అవకాశాలు దక్కించుకుంది. ఎన్నో సినిమాల్లో నటించిన దేవి సినిమాతో ప్రేమకు మంచి పాపులారిటీ వచ్చింది. ఇక ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకున్న ప్రేమ కొన్నాళ్ల తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది అని చెప్పాలి. అయితే కన్నడలో స్టార్ హీరోగా కొనసాగిన ఉపేంద్ర తో ప్రేమ కొన్నాళ్లపాటు ప్రేమాయణం నడిపింది.
తర్వాత మనస్పర్ధలు రావడంతో వీరికి బ్రేకప్ అయింది.. 2006లో జీవన్ అప్పచు అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది ప్రేమ. కానీ కొన్నాళ్లకు భర్తతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. తర్వాత పెళ్లి గురించి కానీ విడాకుల గురించి కానీ తాను అనుభవించిన బాధల గురించి కానీ ఎక్కడా బయట చెప్పలేదు. మీడియా వాళ్లు ఎన్నిసార్లు ప్రశ్నించిన వ్యక్తిగత విషయాలు చెప్పను అంటూ చెప్పేసింది. ఇక అంతలోనే ప్రేమ క్యాన్సర్ బారిన పడింది. కానీ ఆత్మవిశ్వాసంతో బయటపడింది. అయితే ప్రేమ రెండో పెళ్లి చేసుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ అలా మాత్రం జరగలేదు. ఇప్పటికీ ఆమె సింగల్ గానే ఉంటుంది.