బాహుబలి" సినిమా తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మర్చిపోలే ని బ్లాక్ బస్టర్ ని అందు కున్నారు కానీ ఆ తరువాత మాత్రం ఒక్క మంచి హిట్టు కూడా ప్రభాస్ కరియర్ లో పడలేదు.
ఒక వైపు సాహో సినిమా అంతంత మాత్రంగా నే ఆడగా మరో వైపు "రాధేశ్యామ్" సినిమా బాక్సా ఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. భారీ అంచనా ల మధ్య విడుదలైనప్పటి కీ అభి మానులు సైతం ఆ సినిమా ని మర్చిపోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే తాజాగా తన తదుపరి సినిమాల విషయం లో ప్రభాస్ అతి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

త్వరలో నే ప్రభాస్ హీరో గా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం లో "ఆది పురుష్" అనే సినిమా తెర కెక్కనుంది. భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియన్ సినిమా గా విడుదల కాబోతున్న ఈ చిత్రం తెలుగు లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా విడుదల కాబోతోంది. బాహుబలి హిందీ వర్షన్ లో ప్రభాస్ పాత్రకి శరద్ కేల్కర్ డబ్బింగ్ చెప్పారు. అతని వాయిస్ ప్రభాస్ కి బీభత్సం గా సెట్ అయిపోవడం తో సినిమా కి మరింత క్రేజీ ఏర్పడింది.

అదే జోరు తో శరద్ కేల్కర్ ప్రభాస్ నటించిన "రాధే శ్యామ్" సినిమా కి కూడా డబ్బింగ్ చెప్పారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో ఈసారి రిస్క్ తీసు కోకుండా ప్రభాస్ స్వయం గా తన పాత్ర కి డబ్బింగ్ చెప్పు కోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటి కే శరద్ కేల్కర్ "ఆది పురుష్" డబ్బింగ్ పూర్తి చేసినప్పటి కీ ప్రభాస్ మాత్రం తానే స్వయంగా డబ్బింగ్ చెబితే బాగుం టుందని అను కుంటున్నట్లు సమా చారం

మరింత సమాచారం తెలుసుకోండి: