సస్పెన్స్ థ్రిల్లర్ కం హారర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి. రజనీకాంత్, నయనతార, జ్యోతిక లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో ఒక ప్రభంజనం సృష్టించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ అందుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే బాగుంటుందని ప్రేక్షకుల కల ఎట్టకేలకు తీరబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రముఖి 2 సీక్వెల్ పట్టాలెక్కేసింది. ఇందులో డాన్స్ మాస్టర్ కం దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలం లో రాఘవ లారెన్స్ ముని మూవీ సీక్వెల్స్ తో హారర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న విషయం విదితమే.

కాగా ఇపుడు చంద్రముఖి వంటి బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ లో రాఘవ లారెన్స్ నటిస్తుండటం తో అంచనాలు మరింత పెరిగాయి. కామెడీ కి కామెడీ, యాక్షన్ కి యాక్షన్, ఫుల్ జోష్ తో డాన్స్ ఇలా అన్ని కలగలిపి మరోసారి ఈ చిత్రాన్ని సిద్దం చేస్తున్నారు రాఘవ లారెన్స్.  పి. వాసు దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్  జరుపుకుంటోంది.  లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. లక్ష్మి మీనన్ ఇందులో లీడ్  హీరోయిన్ గా చేస్తుండగా, ఇంకా మరో నలుగురు కొత్త హీరోయిన్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది .

అంతే కాకుండా ఈ మూవీ ప్రఖ్యాత ఓటిటి నెట్ ఫ్లిక్స్ తో డిజిటల్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్టు కు సీక్వెల్ కావడంతో, ఈ మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకునేందుకు నెట్ ఫ్లిక్స్ ముందడుగు వేసి, భారీ మొత్తం లో డబ్బులు వెచ్చించి సొంతం చేసుకుంది అని అంటున్నారు . అయితే ఈ విషయం పై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఇప్పుడు మరొక గాసిప్ ఈ సినిమా గురించి ఇంటరెస్ట్ యూ పెంచుతోంది. ఇందులో ఒక కీలక పాత్ర కోసం రమ్యకృష్ణను అడిగారట. ఈ పాత్ర కూడా సినిమాకు మంచి వెయిట్ ఇస్తుందని ఫీలింగ్. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం మాత్రం ఇంకా బయటకు రాలేదు. మరి ఈ సినిమా మొదటి పార్ట్ లాగా ఆకట్టుకుని హిట్ ను సొంతం చేసుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: