సమంత, నాగ చైతన్య విడిపోయి సంవత్సరం కావస్తోంది. అయినా వీరిపై ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. ఎప్పుడూ వీరిపై గాసిప్స్ వైరల్ అవుతూ నే ఉన్నాయి.
అంతే కాకుండా అప్పుడ ప్పుడు అక్కినేని ఫ్యామిలీ పై కూడా గాసిప్స్ వస్తున్నాయి. ఈ క్రమం లో తాజా గా సోషల్ మీడియా లో ఓ వీడియో వైరల్ అవుతుంది. అది పాత వీడియో నో, కొత్త వీడియో నో తెలియదు కానీ, దానిపై ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు.
విడాకుల తర్వాత మొదటి సారి అక్కినేని నాగార్జున ఇంట్లో సమంత ఫోటోలు దర్శనం ఇచ్చాయి. అది ఎలా అనకుంటున్నారా..? అక్కినేని నాగార్జున, అఖిల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అడ్వర్టైజ్ మెంట్ చేశారు. అందు లో అఖిల్ ఎక్కడి కో వెళ్ళ డానికి రెడీ అవుతుంటే టక్కున నాగార్జున గర్ల్ ఫ్రెండ్ దగ్గర కా అంటూ అడగడం దానికి సంబంధించిన వివరాల ను అఖిల్ చెప్తుంటాడు. ఈ క్రమం లోనే నాగార్జున చేతి లో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్యాగ్ ఉంటుంది. దీంతో ఆ బ్యాగ్ ని చూసి అఖిల్ నీకు కొత్త గర్ల్ ఫ్రెండ్ నా.. అంటే నాగార్జున రేయ్ నాకు ఉండేది ఒక్కతే గర్ల్ ఫ్రెండ్ రా అంటూ ఆ బ్యాగ్ ని అఖిల్ చేతిలో పెట్టి వెళ్లిపోతాడు. అయితే ఆ బ్యాగ్‌ పై సమంత ఫొటో ఉంటుంది. ఇక ఇది చూసిన వారందరూ విడాకుల తర్వాత మొదటి సారి నాగార్జున ఇంట్లో సమంత ని చూడటం అంటుంటే, మరికొందరు సమంత  ను దూరం పెట్టారు గా, ఈ విధంగా దగ్గరికి తీసుకుంటున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత సామ్, చై సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తో సహా చాలా యాడ్స్ చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: