గత రెండు మూడు సంవత్సరాలుగా మల్లెమాల వారు జబర్దస్త్ కమెడియన్స్ ని మాత్రమే కాకుండా వారి యొక్క కుటుంబ సభ్యులను కూడా తెగ వాడేస్తున్నారు.
జబర్దస్త్ లో లేదంటే ఎక్స్ట్రా జబర్దస్త్ లో అది కాదంటే శ్రీదేవి డ్రామా కంపెనీలు ఇలా ఏదో ఒక చోట ఈటీవీ వారు మల్లెమాల వారు జబర్దస్త్ కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ని దించడం కామన్ గా జరుగుతుంది. ఏదో ఒక కార్యక్రమంలో ఎంతో మంది ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉంటారు. కానీ అందులో ఒక్కలు ఇద్దరు అలా అందరికీ గుర్తుండి పోతారు. బాబు సిస్టర్ ఎలా ఫేమస్ అయిందో.. అలా రాకెట్ రాఘవ యొక్క తనయుడు మురారి కూడా అంతగా ఫేమస్ అయ్యాడు. కేవలం గెస్ట్ ఆర్టిస్టుగా వచ్చి వెళ్లకుండా పేమెంట్ ఆర్టిస్టుగా మురారి జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీలో సెటిల్ అయ్యాడు అంటే మురారి ఏ స్థాయిలో ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.

ఏ టీంలో చేసిన కూడా వారు చెప్పే పంచ్ లను ఉన్నది ఉన్నట్లుగా చెబుతూ ప్రేక్షకులను నవ్విస్తూ.. తన తండ్రిపై అలవోకగా కంటిన్యూగా పంచ్ లు వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తుంటాడు. ఎక్కువగా తన తండ్రి టీం లో కనిపించే మురారి ఇటీవల హైపర్ ఆది టీం లో కూడా కనిపించిన విషయం తెలిసిందే. కంటెస్టెంట్స్ తక్కువ ఎక్కువ అని కాకుండా మురారికి అవకాశం ఉంటే కచ్చితంగా ఏ టీం లీడర్ అయినా పిలుస్తాడు అందులో ఎలాంటి డౌట్ లేదు. కంటెంట్ ఉన్న మురారి మంచి పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటాడు, అందుకే ఈటీవీ మల్లెమాల వారు రాకెట్ రాఘవ కొడుకు మురారి కి మంచి పారితోషకంను ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లో చాలా మంది పిల్లలు రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటారు. వారిలో అత్యధిక పారితోషకం మురారి దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఒక శ్రీదేవి డ్రామా కంపెనీ స్కిట్ లో కనిపించాలన్నా జబర్దస్త్ స్కిట్ లో కనిపించాలన్నా మురారి ఒక కాల్ షీట్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకుగాను మురారికి టీం లీడర్ లేదా మల్లెమాల వారు 5000 రూపాయలను చెల్లిస్తారట. కాస్త ఎక్కువ నిడివి ఉన్న పాత్ర.. లేదంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటే పది వేల రూపాయల వరకు మురారి కి పారితోషికంగా ఇస్తారట. ఈ వయసులోనే ఇంతగా సంపాదిస్తే ముందు ముందు మురారి సంపాదన ఎంతగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: