బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుండి తాజాగా భారీ అంచనాల నడుమ బ్రహ్మాస్త్ర అనే సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొత్తం మూడు భాగాలుగా విడుదల కాబోతుంది. అందులో మొదటి భాగం కొన్ని రోజుల క్రితం భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. బ్రహ్మాస్త్ర మొదటి భాగంలో రన్బీర్ కపూర్ హీరోగా నటించిన ఆలియా భట్ హీరోయిన్ గా నటించింది.

అమితా బచ్చన్ ,  నాగార్జున ,  మౌని రాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ 2D మరియు 3D వర్షన్ లలో విడుదల అయింది. ఈ మూవీ హిందీ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. తెలుగు లో ఈ మూవీ ని దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సమర్పించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన బ్రహ్మాస్త్ర మూవీ హిందీ తో పాటు తెలుగు లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా బ్రహ్మాస్త్ర పార్ట్ 2 మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ...  బ్రహ్మాస్త్ర పార్ట్ 2 మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో లలో ఒకరు అయిన హృతిక్ రోషన్ నటించే అవకాశం ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా హృతిక్ రోషన్ 'విక్రమ్ వేద' అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ కూడా హీరోగా నటించాడు. ఈ మూవీ ఈ రోజు అనగా సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ పై హిందీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: