నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ పోయిన సంవత్సరం టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ మూవీ తో అద్భుతమైన భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని  సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అఖండ మూవీ 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర కొల్ల గొట్టి పోయిన సంవత్సరం భారీ బ్లాక్ బస్టర్ విజయాల లిస్ట్ లో చేరిపోయింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ ,  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తేరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. అఖండ మూవీ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న మూవీ కావడం ,  క్రాక్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ని కన్ఫామ్ చేయలేదు. దానితో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 107 వ మూవీ గా తెరకెక్కుతూ ఉండడంతో ఈ మూవీ షూటింగ్ ఎన్ బి కె 107 అని వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ టైటిల్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ కు సంబంధించిన ప్రకటన దసరా రోజు వచ్చే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తూ ఉండగా ,  దునియా విజయ్మూవీ లో విలన్ గా కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: