గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ ,  కార్తీ ,  జయం రవి , ఐశ్వర్య రాయ్ ,  త్రిష , శోభితా ధూళిపాల వంటి నటులు నటించారు. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అందులో మొదటి భాగం నిన్న అనగా సెప్టెంబర్ 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ ,  మలయాళ , హిందీ లో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సీడ్ టాక్ లభించింది. అలా మొదటి రోజు మొదటి షో కే పొన్నియన్ సెల్వన్ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సీడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ మూవీ కి మొదటి రోజు అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్ లు లభించాయి. పొన్నియన్ సెల్వన్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

తమిళనాడు :  26.85 కోట్లు .
రెండు తెలుగు రాష్టలలో :  5.50 కోట్లు .
కర్ణాటక :  4.05 కోట్లు .
కేరళ :  3.20 కోట్లు .
రెస్ట్ ఆఫ్ ఇండియా లో  2.60 కోట్లు .
ఓవర్ సిస్ లో :  40.10 కోట్లు .
మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా పొన్నియన్ సెల్వన్ మూవీ 41.80 కోట్ల షేర్ , 82.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా పొన్నియన్ సెల్వన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుత మైన కలెక్షన్ లను రాబట్టింది. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: