‘మేజర్’ సూపర్ సక్సస్ తరువాత అడవి శేషు క్రేజ్ మరింత పెరిగింది. వరస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరో లేటెస్ట్ గా నటిస్తున్న ‘హిట్ 2’ మూవీ పై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ఈమూవీ టీజర్ కు ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈసినిమా కూడ హిట్ అవుతుంది అన్న అంచనాలతో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి.ఈసినిమా సగటు ప్రేక్షకుడుని బాగా ఎంగేజ్ చేయడమే కాకుండా ఈసినిమాకు సంబంధించిన నెక్స్ట్ సీన్ లో ఏమవుతుంది అన్న సస్పెన్స్ తో ఈమూవీని చూస్తూ  కూర్చున్న సగటు ప్రేక్షకుడి మైండ్ మరొక వైపు వెళ్ళనీయకుండా చేయడమే కాకుండా విలన్ ఎవరు అన్న సస్పెన్స్ చివరి వరకు తెలియకపోవడంతో సస్పెన్స్ క్రైమ్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈమూవీ బాగా నచ్చుతుంది అన్న అంచనాలు ఉన్నాయి.అంతేకాదు అడవి శేషు ఈ మర్డర్ మిష్టరీని సాల్వ్ చేసే క్రమంలో సగటు ప్రేక్షకుడు ఊహించని ట్విస్ట్ లు ఉంటాయని అంటున్నారు. ‘హిట్ 1’ మూవీకి మించి ‘హిట్ 2’ ఉంటుందని ఈమూవీలో అడవి శేషు నటన హైలెట్ అన్న లీకులు వస్తున్నాయి.  
మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో యూత్ ను ఆకట్టుకునే మంచి రొమాంటిక్ సీన్స్ కూడ ఉంటాయని తెలుస్తోంది.


డైరెక్టర్ శైలేష్ ఎంతో రీసెర్చ్ చేసి ఈ కథను వ్రాసానని చెపుతున్నాడు. అంతేకాదు హిట్ సిరీస్ లో ఇంకా చాల సినిమాలు వస్తాయని ‘హిట్ 7’ వరకు ఈమూవీ ఫ్రాంచేజ్ లు ఉంటాయని చెపుతున్నాడు. ఈమూవీ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా వచ్చిన రాజమౌళి సూచన ప్రకారం హిట్ సిరీస్ లో సినిమాలు ప్రతి సంవత్సరం ఉండేలా నిర్మాత నాని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ‘హిట్ 2’ చివరిలో ‘హిట్ 3’ కి సంబందించిన క్లూ ఉంటుందని చెపుతూ అందులో హీరో ఎవరన్నది కూడా రివీల్ చేస్తారని దర్శకుడు శైలేష్ చెపుతున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: