ఇండస్ట్రీలో రాజమౌళి తరువాత ఇప్పటివరకు పరాజయం అన్న పదాన్ని ఎరగని ఏకైక దర్శకుడు అనీల్ రావిపూడి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు తాను తీసిన కామెడీ ట్రాక్ సినిమాలకు భిన్నంగా అనీల్ రావిపూడి బాలకృష్ణ తో ఒక మాస్ సినిమాను చేయబోతున్నాడు. దీనితో బాలయ్యను అనీల్ ఎంతవరకు హ్యాండిల్ చేయగలడు అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నాయి.


ఇప్పుడు ఈ సందేహాలకు అనీల్ రావిపూడి సమాధానం ఇచ్చినట్లు కనిపిస్తోంది. త్వరలో ఆహా లో స్ట్రీమ్ కాబోతున్న కామెడీ షో స్టాక్ ఎక్స్ చేంజ్ కార్యక్రమాన్ని అనీల్ రావిపూడి హోస్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ఈ కార్యక్రమం చూడటానికి వచ్చిన కొంతమందితో అనీల్ రావిపూడి మాట్లాడుతూ త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న బాలకృష్ణ మూవీ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.


ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ అంతా పూర్తి అయిందని తన రొటీన్ కథలా ఈ మూవీ కథ ఉండదని చెపుతూ ఈ మూవీ పై అంచనాలు పెంచుతున్నాడు. ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ బాలకృష్ణ తో సినిమా చేయాలి అంటే అంత సులువైన పని కాదని ఒళ్ళుజాగ్రత్త పెట్టుకుని బాలయ్యతో ఈ సినిమా తీయాలి అని కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈమూవీలో బాలకృష్ణ ద్విపాత్రాభిమానియం చేయడం లేదని బాలయ్య పాత్రను ఊహించుకోవడం కష్టం అని అంటున్నారు.


వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుండి ఈమూవీ షూటింగ్ మొదలు కాబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. ప్రస్తుతం యూత్ లో క్రేజీ హీరోయిన్ గా విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న శ్రీలీల ఈమూవీలో బాలయ్య కూతురుగా నటిస్తోంది. ఈమూవీలో బాలయ్య భార్యగా రమ్యకృష్ణ లేదంటే అనుష్క నటిస్తుంది అని లీకులు ఉన్నప్పటికీ ఈవిషయమై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదు. వరస విజయాలతో దూసుకు పోతున్న బాలయ్య ఈమూవీతో కూడ హిట్ కొడితే బాలయ్యకు హ్యాట్రిక్ హిట్స్ వచ్చినట్లు అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: