ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఒక రచయిత లేదా దర్శకుడు చెప్పే కథను విన్న వెంటనే ఆకథ మంచి సినిమాకు సరిపోతుందా లేదా అన్న స్పాట్ జడ్జిమెంట్ ఇవ్వడంలో మంచి దిట్ట అన్న ప్రచారం ఉంది. ఒక భారీ సినిమాకు అయినా మరొక చిన్న సినిమాకు అయినా ఖర్చుపెట్టే డబ్బు పై కంట్రోల్ పెట్టుకుంటూ ఎంతవరకు ఆసినిమాకు అవసరమో అంతవరకు మాత్రమే ఖర్చు పెడతాడు కాబట్టి దిల్ రాజ్ సక్సస్ ఫుల్ నిర్మాతగా ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నాడు అన్న కామెంట్స్ ఉన్నాయి.


ప్రస్తుతం తమిళ హీరో విజయ్ తో ఒక భారీ సినిమాను తీస్తున్న దిల్ రాజ్ ఆసినిమాను తీస్తూనే మరికొన్ని చిన్న సినిమాలను తీస్తున్నాడు. ఆ చిన్న సినిమాలలో ‘బలగం’ అన్న టైటిల్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఒక మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. తెలంగాణ నేపథ్యంలో తీస్తున్న ఒక ఎమోషనల్ మూవీ ఇది అని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ లు విడుదల చేస్తారని తెలుస్తోంది.


‘మల్లేశం’ మూవీతో హీరోగా టర్న్ అయిన ప్రియదర్శి ఇందులో కూడ హీరోగా నటిస్తున్నాడు. ఈమధ్య కాలంలో మంచి పేరులోకి వస్తున్న భీమ్స్ ఈసినిమాకు మ్యూజిక్ కంపోజర్. ఇందులో మంగ్లీ పాడిన ఒక పాట గురించి మంచి టాక్ వినిపిస్తూ ఆపాట ట్రెండింగ్ కాబోతోంది అని అంటున్నారు. కమెడియన్ వేణును దర్శకుడిగా పరిచయం చేస్తూ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.


ఒక నటుడుకి దర్శకుడుగా దిల్ రాజ్ అవకాశం ఇచ్చి ఇలాంటి చిన్న సినిమాను తీయిస్తున్నాడు అంటే ఆ మూవీ స్క్రిప్ట్ పై దిల్ రాజ్ కు ఎంత నమ్మకం ఉందో అర్థం అవుతుంది. దిల్ రాజు బేనర్ నుండి ఇప్పటికే చాలా మంది దర్శకులు పరిచయం అయ్యారు. ఇప్పుడు ఆ లిస్టులోకి కమెడియన్ వేణు కూడ చేరడంతో అతడికి ఎలాంటి అదృష్టం పడుతుందో చూడాలి..మరింత సమాచారం తెలుసుకోండి: