ప్రామిసింగ్ నటుడు సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలతో కెరియర్ ను మొదలుపెట్టిన సత్యదేవ్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న మూవీలలో హీరో అవకాశాలను దక్కించుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో క్రేజ్ ఉన్న సినిమాలలో ఇతర ముఖ్యపాత్రలో కూడా నటిస్తున్నాడు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్  మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సత్య దేవ్ "గుర్తుందా సీతాకాలం" అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో సత్యదేవ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా , నాగ శేఖర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. 

మూవీ ని డిసెంబర్ 9 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే గుర్తుందా సీతాకాలం మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అది పోయే అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని మరియు వేదికను ఫిక్స్ చేసింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను డిసెంబర్ 5 వ తేదీన సాయంత్రం 6 గంటలకు జే ఆర్ సి కన్వెన్షన్ , హాల్ 2 ,  హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు , ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి అడవి శేషు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: