ఎప్పుడైతే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో సినిమా తీస్తూ ఆయనకే ఎక్కువ థియేటర్లు సంక్రాంతి పండుగకు కేటాయిస్తున్నారో అప్పటినుంచి నిర్మాత దిల్ రాజు పై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. అంతే కాదు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరో అజిత్ కంటే విజయ్ చాలా గ్రేట్ అంటూ చేసిన కామెంట్లు అజిత్ అభిమానులకు పూర్తిస్థాయిలో ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తూ కామెంట్లు కూడా చేశారు. కానీ ఈ విషయాలపై స్పందించిన దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి మరీ "ఏం మాట్లాడాలన్నా భయం వేస్తోంది" అంటూ మాట్లాడడంతో ఈయనపై ట్రోల్స్ కాస్త తగ్గాయని చెప్పాలి. ఆ తర్వాత విజయ్ , అజిత్ ఇద్దరు కూడా స్టార్ హీరోలే అంటూ కామెంట్లు చేశారు.


ఈ సమస్య మొన్నటి వరకు సద్దుమణిగింది అని అనుకునే లోపే ఇప్పుడు మళ్ళీ వివాదాలకు తెరలేపి.. అభిమానుల ఆగ్రహానికి గురి అవుతున్నారు తెలుగు బడా నిర్మాత దిల్ రాజు. అసలు విషయం ఏమిటంటే తెలుగు స్టార్ హీరోలైన బాలకృష్ణ , చిరంజీవి.. వీరసింహారెడ్డి .. వాల్తేరు వీరయ్య సినిమాలను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే ఈ సినిమాలకు పోటీగా కోలీవుడ్ స్టార్ హీరోలు నటించిన అజిత్ తునివు.. విజయ్ వరిసు సినిమాలు కూడా సంక్రాంతి పండుగకు పోటీ పడుతున్నాయి.

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ చేపడుతుండగా ప్రమోషన్స్ లో భాగంగా అజిత్ నటిస్తున్న తునివు డైరెక్టర్ హెచ్ వినోద్ మాట్లాడుతూ .. తునివు మరియు వరిసు రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద గెలవాలి అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.  కానీ దిల్ రాజు మాత్రం సంక్రాంతి విజేతగా వరిసు సినిమా నిలుస్తుందని.. విజయ్ మాత్రమే నంబర్ వన్ హీరో అని నిర్మాత దిల్ రాజు అన్నాడు. దీంతో అజిత్ అభిమానులు ఈయనపై పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: