సింగర్ చిన్మయి శ్రీపాద సాధారణంగా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ ఏం జరిగినా కూడా వెంటనే స్పందిస్తుంది సింగర్ చిన్మయి. ఎవరైనా తప్పు చేశారూ అనిపిస్తే వెంటనే సోషల్ మీడియా వేదికగా చెప్తుంది సింగర్ చిన్మయి. అయితే తాజాగా బిగ్ బాస్ రన్నర్ శ్రీహన్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో పై ఫైర్ అయింది. ఇక అసలు విషయం ఏంటంటే మాట వినని చైతుని దారిలో పెట్టాలని శ్రీహన్ తనను తాను కొట్టుకున్నట్లుగా ఒక బెల్టుతో కొట్టుకుంటున్నట్లు నటిస్తాడు. ఎన్నిసార్లు చెప్పాలి నా మాట వింటావా లేదా అని బెల్టుతో కొట్టుకున్నట్లు చైతు ముందు నటిస్తాడు. 

దీంతో చైతో.. వింటా డాడీ కొట్టుకోవద్దు సారీ అంటూ ఏడుస్తూ ఉంటారు. అయితే దీని అంతటిని వీడియో తీస్తుంది సిరి. ఇక వీడియో తీస్తూ సిరి నవ్వుతూ ఉంటుంది.అయితే తాజాగా ఈ వీడియోను చూసిన సింగర్ చిన్మయి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే తను ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఆ పోస్టులో ఈ విధంగా పేర్కొంది... మనకు మనం హాని చేసుకోవడం వల్ల పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం పడుతుంది. మీరే కాదు చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలు చెప్పిన మాట వినకపోతే వారిని వారు కొట్టుకోవడము లేకపోతే మేము చచ్చిపోతాము అంటూ పిల్లల్ని బెదిరిస్తూ ఉంటారు.

సాధారణంగా మేము చూసిన సంబంధాన్ని చేసుకోకపోతే మేము చచ్చిపోతాము అని పిల్లల్ని భయపడుతూ ఉంటారు. ఇక ఇలాంటి పద్ధతికి ఈ జనరేషన్ పిల్లలు అయినా ఫుల్ స్టాప్ పెట్టాలి అంటూ ఒక వీడియోని తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది.దీనితో  శ్రీహాన్ మరియు ఆయన అభిమానులు మేమేదో సరదాగా చేసామని దాన్ని సీరియస్గా తీసుకోవద్దని చెప్పుకొచ్చారు. ఇందుకుగాను శ్రీహాన్ సోషల్ మీడియా వేదికగా ఇదంతా ఒక స్క్రిప్ట్ అని చైతుకి సంబంధించిన ఒక షూటింగ్లో ఈ వీడియో ఒక భాగమని చెప్పుకొచ్చాడు. ఇక మరికొందరు నెటిజన్స్ పిల్లల ముందు స్వీయ హాని చేసుకోవడం తప్పు అని ..అసలు పిల్లల్ని పెంచే పద్ధతి అదేనా అని సిరి మరియు శ్రీహాన్ పై మండిపడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: