మెగా కుటుంబం నుంచి హీరోగా వచ్చిన వారిలో వరుణ్ తేజ్ కూడా ఒకరు. ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలలో చేయాలని చాలా ఆత్రుతగా ఉంటారు. అలా గత ఏడాది గని అనే స్పోర్ట్స్ డ్రామా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విఫలమయ్యారు. ఆ తర్వాత ఫన్ అండ్ ప్రెస్టేజ్ అనే సినిమాతో వచ్చి పరవాలేదు అనిపించుకున్నారు. దీంతో వరుణ్ తేజ్ కాస్త రిలాక్స్ అయ్యారని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రవీణ్ సతార్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ని కూడా ఫిక్స్ చేయడం జరిగింది.

ఈ చిత్రానికి గాండీవ దారి అర్జున అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ టీజర్ ఒక భారీ యాక్షన్ సీక్వెల్ని కూడా గ్రాఫిక్స్ లు చూపిస్తున్నారు. అలాగే ఇందులో తుపాకీలతో షూట్ చేస్తున్న వరుణ్ తేజ్ పాత్రను కూడా చిత్ర బృందం పరిచయం చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది.ఈ టైటిల్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్లు చూస్తే ఈ సినిమా పూర్తిస్థాయిలో యాక్షన్ సినిమా అన్నట్లుగా కనిపిస్తోంది.

వరుణ్ తేజ్ ఈ చిత్రంలో ఒక సెక్యూరిటీ ఎక్స్టరుగా కనిపించబోతున్నారు. అయితే తాజాగా జరుగుతున్న మరొక ప్రచారం ఏమిటంటే భారీ యాక్షన్ మూవీ అని కానీ బడ్జెట్ మాత్రం తక్కువగానే ఉంటుందని అంటున్నారు.ఈ సినిమాకి డైరెక్టర్ నిర్మాత ఇచ్చిన బడ్జెట్ రూ.35  కోట్ల రూపాయలని సమాచారం. అయితే డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు గత సినిమాలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా బడ్జెట్ లిమిట్ దాటకుండా పూర్తి చేయగలడనే నమ్మక నిర్మాతలకు ఉండడంతో ఈ చిత్రానికి అంత తక్కువ బడ్జెట్ను నిర్మించినట్లు సమాచారం. ఇక గతంలో నాగార్జున వంటి వారితో కూడా ఈయన పని చేశారు. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమా బడ్జెట్ లిమిట్ దాటకుండా పూర్తి చేయగలడా లేదా అనే విషయం ఆ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: