సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు అని చెప్పాలి . అంతేకాకుండా వరుసగా సూపర్ హిట్ లు సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద సింహంలా గర్జిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. గత ఏడాది అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన బాలకృష్ణ ఇక ఈ ఏడాది సంక్రాంతికి వీర సింహారెడ్డి అనే ఓ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ విజయాన్ని సాధించింది అని చెప్పాలి.


 ఇలా 60 ఏళ్ల వయసు దాటి పోతున్న కూడా ఇంకా యువ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతూ ఉన్నాడు బాలకృష్ణ. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడితో ఒక సినిమా చేస్తున్నాడు. సాధారణంగానే అనిల్ రావిపూడి సినిమా అంటే కామెడీ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. అయితే ఇక బాలయ్యను అనిల్ రావిపూడి ఎలా చూపించబోతున్నాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది.


 అయితే ఇప్పుడు వరకు బాలయ్య అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య సరసన నటించే హీరోయిన్ ఎవరు అనే విషయంపై క్లారిటీ రాలేదు అని చెప్పాలి. అయితే ఇక బాలయ్య సరసన హీరోయిన్ పాత్ర కోసం కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ఎంపిక చేశారు అన్న టాక్ తెరమీదకి వచ్చింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తుంది. అయితే బాలయ్యకు జోడిగా విజయ్ దేవరకొండ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ నటిస్తుందని గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆ ఛాన్స్ ప్రియాంకకు దక్కలేదట. ఇక బాలయ్య సరసన కాజల్ అయితేనే బాగుంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి అనుకుని ఆమెకు ఆఫర్ ఇచ్చేసాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nbk