తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న అజిత్ కుమార్ తాజాగా తునివు అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. బోనీ కపూర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు . ఈ సినిమా ఈ సంవత్సరం జనవరి 11 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది, . తమిళం లో రూపొందించిన ఈ సినిమాను తెగింపు అనే పేరుతో జనవరి 11 వ తేదీనే తెలుగు లో కూడా విడుదల చేశారు .

తెలుగు.లో కూడా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది . ఇది ఇలా ఉంటే తమిళ , తెలుగు సినీ ప్రేమికులను పర్వాలేదు అనే రేంజ్ లో అలరించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో 'ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది . తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలుబడింది. 

మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అలాగే ఈ సంస్థ ఈ సినిమాను ఫిబ్రవరి 8 వ తేదీ నుండి ఈ సినిమాను తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: