కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన మోస్ట్ బ్యూటిఫుల్ నటి శ్రేయ సరన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. అందులో భాగంగా వారితో నటించిన సినిమాలలో చాలా సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేకుండా కెరియర్ ను కొనసాగించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది.

మళ్లీ ఈ మధ్య సినిమాలలో సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తోంది. అందులో భాగంగా శ్రేయ కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలలో కూడా వరుస క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే శ్రేయ హిందీ లో రూపొందిన దృశ్యం 2 మూవీ లో కీలక పాత్రలో నటించింది.

అజయ్ దేవగన్ హీరో గా రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రేయ ...  ఉపేంద్ర హీరో గా కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో ఆర్ చంద్రు దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కబ్జా లో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి ప్రస్తుతం థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఈ ముద్దుగుమ్మ క్రేజీ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: