‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ రాజమౌళి సినిమా తీసినప్పటికీ ఆమూవీ విడుదలైన తరువాత ఆసినిమా క్రెడిట్ ను తన ఇమేజ్ పెంపుదలకు ఉపయోగించుకోవడంలో జూనియర్ ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ చాలతెలివిగా అడుగులు వేసాడు అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన వెంటనే చరణ్ జూనియర్ కంటే ముందుగా అమెరికాకు వెళ్ళడమే కాకుండా అక్కడ మీడియా ఇంటర్వ్యూలు ఇస్తూ తనకు తాను గ్లోబల్ స్టార్ గా ప్రమోట్ చేసుకున్నాడు. ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్ ముగిసిన తరువాత జూనియర్ వెంటనే హైదరాబాద్ కు తిరిగి వస్తే రామ్ చరణ్ అలా చేయకుండా అతడు ఢిల్లీకి వెళ్ళి అక్కడ నేషనల్ ఛానల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఆతరువాత ఢిల్లీలో హోమ్ మంత్రి అమిత్ షాను కలిసిన సందర్భానికి సంబంధించిన వీడియోను మీడియాకు లీక్ చేయడమే కాకుండా ఢిల్లీలో తనకు బాగా అభిమానులు ఉన్నారు అని సంకేతాలు వచ్చేవిధంగా అక్కడ ఎయిర్ పోర్ట్ లో ఘనమైన స్వాగతాన్ని అందుకున్నాడు.
అయితే ఈవిషయంలో తారక్ ఎందుకు వెనకపడుతున్నాడు అన్నవిషయం అతడి అభిమానులకు కూడ అంతుపట్టని విషయంగా ఉంది అని అంటున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఘనమైన స్వాగతానికి అతడి అభిమానులు ప్రయత్నించినప్పటికీ జూనియర్ ఈవిషయంలో పెద్దగా ఆశక్తి కనపరచలేదు అని కొందరు అంటున్నారు. అంతేకాదు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ జూనియర్ తో స్పెషల్ ఇంటర్వ్యూను ఆస్కార్ అవార్డుల విషయమై ఏర్పాటు చేస్తాము అని చెప్పినప్పటికీ తారక్ ఆవిషయంలో కూడ మౌనం వహించడం వెనుక కారణం ఏమిటి అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు.
దీనికితోడు తెలుగుదేశం వర్గాలు జూనియర్ తో సన్నిహితంగా ఉండాలని కొందరు ప్రయత్నిస్తున్నప్పటికీ వారిపట్ల కూడ తారక్ కొంత దూరంగా ఉంటున్న పరిస్థితులలో ఇలా అనేక విషయాలలో తారక్ చరణ్ కంటే కొన్ని విషయాలలో వెనకపడుతున్నాడా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు..మరింత సమాచారం తెలుసుకోండి: