తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోల్లో నితిన్ ఒకరు. ఈ యువ నటుడు ఇప్పటికే ఎన్నో మంచి విజయవంతమైన మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడి గా తన కంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా నితిన్ ... ఎం ఎస్ రెడ్డి దర్శకత్వంలో కృతి శెట్టి హీరోయిన్ గా రూపొందిన మాచర్ల నియోజకవర్గం అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నితిన్ కలెక్టర్ పాత్రలో నటించాడు.

 ఈ మూవీ లో కృతి శెట్టిnతో పాటు క్యాతరిన్ కూడా హీరోయిన్ గ నటించింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ మూవీ లో సముద్ర ఖని ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. కెరియర్ లో మొట్ట మొదటి సారి నితిన్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ లో నటించడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నితిన్ ... వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయింది. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గ నటిస్తోంది. ఇప్పటివరకు ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ చిత్ర బృందం ప్రస్తుతం ఈ మూవీ కి "సైతాన్" అనే టైటిల్ ను పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: