సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎక్కువగా సెంటిమెంట్లు కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఒక హీరోకి కలిసి వచ్చిన డేట్ లోనే ఇక అతని తర్వాత సినిమాలను కూడా విడుదల చేయడం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. అదే సమయంలో హీరోకి కలిసి రాని డేట్లలో ఇక మంచి ముహూర్తాలు ఉన్న సినిమాను విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు అస్సలు సాహసం చేయరు అని చెప్పాలి. అంతేకాదు ఇక సినిమాలోని ప్రతి విషయంలో కూడా ఇలాంటి సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. ఇక అచ్చం ఇలాగే ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు విషయంలో కూడా ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది అన్నది అర్థమవుతుంది.



 సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మహేష్ బాబు తక్కువ సమయంలోనే నేటి తరానికి సూపర్ స్టార్ గా మారిపోయారు అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి వరుసగా సూపర్ హిట్లు సాధిస్తూ దూసుకుపోతున్నాడు మహేష్. అయితే మహేష్ కి కూడా ఒక డేట్ బ్యాడ్ సెంటిమెంట్ గా కొనసాగుతుందట. అదే అక్టోబర్ నెల. మహేష్ బాబు హీరోగా 2002 అక్టోబర్ 31వ తేదీన వచ్చిన బాబీ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. మహేష్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన అతిథి సైతం అక్టోబర్ 18 విడుదలై డిజాస్టర్ గా మిగిలింది. ఇక మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో అక్టోబర్ 7న విడుదలైన ఖలేజా ఫ్లాప్  గానే మిగిలింది. అందుకే ఇప్పుడు మహేష్, త్రివిక్రమ్ సినిమాని అక్టోబర్లో కాకుండా ఆగస్టులో విడుదల చేస్తే బాగుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.



 కాగా మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు అన్నది మాత్రం తెలుస్తుంది. దాదాపు 200 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టబోతున్నారు అంటూ ఒక టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అన్నది ఈ నెల 26వ తేదీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: