టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. ఈ యువ హీరో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరో గా నటించడం మాత్రమే కాకుండా కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించి నటుడి గా ... దర్శకుడు గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నగరానికి ఏమైంది మూవీ తో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ కథా నాయకుడు ఆ తర్వాత ఫలక్ నమ దాస్ మూవీ లో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా విశ్వక్ "దాస్ కా దమ్కి" అనే మూవీ లో హీరో గా నటించాడు. అలాగే ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ మంచి అంచనాల నడుమ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయింది.

మంచి అంచనాలు విడుదల అయిన ఈ మూవీ ప్రస్తుతం మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. అందులో భాగంగా ఈ మూవీ కి యుఎస్ఏ లో కూడా ప్రస్తుతం సూపర్ కనెక్షన్ లు లభిస్తున్నాయి. ఈ మూవీ రెండు రోజుల్లో యూఎస్ఏ లో 200 కే ప్లస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది
 ఈ కలెక్షన్ లు విశ్వక్ కెరియర్ లోనే బెస్ట్ కలెక్షన్ లుగా ఈ మూవీ బృందం ప్రకటించింది. ఈ మూవీ లో నివేత పేతురాజ్ విశ్వక్ సరసన హీరోయిన్ గా నటించింది.మరింత సమాచారం తెలుసుకోండి: