తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న నాని తాజాగా దసరా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాని రేపు అనగా మార్చి 30 వ తేదీన వరల్డ్ వైడ్ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమాని ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 2710 థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ... మహానటి కీర్తి సురేష్మూవీ లో నాని సరసన రెండవ సారి హీరోయిన్ గా నటించింది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో నేను లోకల్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందింది. కమర్షియల్ కథతో రూపొందిన ఆ మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

దసరా మూవీ ని దర్శకుడు సింగరేణి బొగ్గు గనుల కార్మికుల నేపథ్యంలో రూపొందించాడు. నానిమూవీ లో అదిరిపోయే ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. అలాగే కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో డి గ్లామరైసేడ్ రోల్ లో కనిపించబోతుంది.  ఈ మూవీ లో నాచురల్ స్టార్ నాని ఊర మాస్ లుక్ లో కనిపించనుండడం ...  కీర్తి సురేష్ డి గ్లామరైసేడ్ రోల్ లో కనిపించనుండడం తో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకి ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ వచ్చినట్లు అయితే 1 వ రోజు ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించే అవకాశాలు  ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: