యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పోయిన సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ తో గ్లోబల్ గా తన క్రేజ్ ను పెంచుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను పెంచుకున్న ఎన్టీఆర్మూవీ కంటే ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగాడు. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో ఆది మూవీ ఒకటి. వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో కీర్తి చావ్లా హీరోయిన్ గా నటించగా ... మణిశర్మమూవీ కి సంగీతం అందించాడు. 28 మార్చ్ 2002 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయి రేంజ్ కలెక్షన్ లను కూడా సాధించింది.

మూవీ తో ఎన్టీఆర్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగి పోయింది. అలాగే ఈ మూవీ ద్వారా దర్శకుడు వినాయక్ కు కూడా మాస్ జనాల్లో ఫుల్ క్రేజ్ లభించింది. ఇలా ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాని తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాను ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 20 వ తేదీన గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మూవీ యూనిటీ అధికారికంగా ప్రకటించింది. మరి అప్పట్లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్ లను సాధించిన ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఈ రేంజ్ కలెక్షన్ లను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: