బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఇప్పటి వరకు నేరుగా ఒక్క తెలుగు మూవీ లో కూడా నటించక పోయినప్పటికీ తాను నటించిన బాలీవుడ్ మూవీ ల ద్వారానే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం షారుఖ్ "పఠాన్" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. దీపికా పదుకొనే ఈ మూవీ లో షారుక్ సారసన హీరోయిన్ గా నటించగా ... జాన్ అబ్రహం ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి సిద్ధార్థ్ ఆనంద్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే షారుక్ చాలా రోజుల క్రితమే అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న జవాన్ మూవీ షూటింగ్ ను ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ తాజాగా ముంబై లో పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ బృందం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే ఈ మూవీ ని జూన్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగియడంతో ఈ మూవీ ని ముందు చెప్పిన జూన్ 2 వ తేదీనే ఈ చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: