తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికి కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వెంకటేష్ ... శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న సైంధవ్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాదు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ యాక్షన్ సన్నివేశాలను వెంకటేష్ పై చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది.

 తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ రోజు ఉదయం 11 గంటల 07 నిమిషాలకు ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ యూనిటీ ఈ రోజు ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ ను ప్రకటిస్తుందో చూడాలి. తాజాగా విక్టరీ వెంకటేష్ ... సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందినటువంటి "కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌" అనే మూవీ లో కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ ఏప్రిల్ 21 వ తేదీన ధియేటర్ లలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: