
పవన్ సినిమా టైటిల్ లేకుండానే ఏంటి కామెడీగా ఉందా అనుకోవచ్చు. కానీ నిర్మాతలు ఈ సాహసాన్ని చేయాలని టాక్. 1998 లో జే డీ చక్రవర్తి సినిమాను కూడా ఇలా పబ్లిస్టీ కోసం టైటిల్ లేకుండా రిలీజ్ చేశారు. ఎక్కువ శాతం ఆడియన్స్ ఏ టైటిల్ రిఫర్ చేస్తే అదే పెడదామని అన్నారు. చివరకు ఆ సినిమాకు అందరు పాపే నా ప్రాణం అని పెట్టారు. అయితే అది జేడీ సినిమా కాబట్టి అలా నడిచింది. కానీ పవన్ సినిమా అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది.
టైటిల్ లేకపోతే బ్యానర్ లు కట్టే ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు. పవన్ సినిమా టైటిల్ లేకుండా అంటే ముందు ఫ్యాన్స్ దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం లేదని చెప్పొచ్చు. మరి నిర్మాతలు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కానీ టైటిల్ లేకుండా పవర్ స్టార్ సినిమా అంటే ఊహించడానికో వెరైటీగా ఉంది. జూలై 28న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాకు ఈలోగా ఏదైనా టైటిల్ పెడతారేమో చూడాలి. అసలైతే దేవర, దేవుడు ఇలాంటి టైటిల్స్ అనుకుంటున్నారని టాక్. ఇదే కాదు ఇయర్ ఎండింగ్ కల్లా పవర్ స్టార్ మరో సినిమాను కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఒకవేళ అది కుదరకపోతే 2024 సంక్రాంతికి అయినా ఓ సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.