సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే నటించిన ‘కిసీ కా బాయ్ కిసీ కా జాన్’ ఫ్లాప్ కావడంతో పూజా హెగ్డే ఫ్లాప్ ల పర్వం కొనసాగుతోంది. వరసగా 5 ఫ్లాప్ లు రావడంతో ఆమె కెరియర్ కొంతవరకు కన్ఫ్యూజన్ లో ఉంది. మహేష్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో నిర్మాణం అవుతున్న మూవీ తప్పా ప్రస్తుతం ఆమె చేతిలో చెప్పుకోతగ్గ భారీ మూవీ ప్రాజెక్ట్స్ ఏమిలేవు.


లేటెస్ట్ గా విడుదలైన సల్మాన్ ఖాన్ తో చేసిన మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన గ్లామర్ సీక్రెట్ ను బయటపెట్టింది. రసాయనాలతో కూడిన ఫేస్ క్రీమ్స్ తాను ఎక్కువగా వాడనని తన మొఖంలో గ్లో ఏమాత్రం తగ్గకుండా ఉండటానికి తాను ఒక సీక్రెట్ ఫేస్ ప్యాక్ ను వాడుతున్న విషయాన్ని తెలియచేసింది. తాను ప్రతిరోజు ఉదయం తన నిద్ర నుండి లేవగానే పాల మీగాడలో పసుపు కలిపిన సహజ సిద్ధమైన ఒక పేస్ట్ ను తన మొఖం పై పెట్టుకుని సుమారు ఒక గంట సేపు ఉంటానని అలా కొన్ని సంవత్సరాలు బట్టి తాను ఈపద్ధతిని అనుసరిస్తూ ఉండటం వల్ల తన మొఖంలో గ్లో ఏమాత్రం తగ్గలేదు అని అంటోంది.


ఇలా చేయడం వల్ల ముఖం రోజంతా మెరుస్తూ ఉంటుందని, ఇది పూర్తిగా సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్ అని చెబుతోంది. ఈ ఫేస్ ప్యాక్ ను ఇలా రెగ్యులర్ గా వాడుతూనే రోజూ తినే భోజనంలో కార్బొహైడ్రేట్లు,నెయ్యి ఉండేలా చూసుకుంటానని అందువల్ల తన ఎనర్జీ లెవల్స్ ఎప్పుడు తగ్గవు అని అంటోంది.



ఇలా సరైన మోతాదులో కార్బోహైడ్రేట్స్ తినడంతో పాటు రోజూవారీ ఆహారంలో నెయ్యిని ఉపయోగించడం వల్ల ముఖంలోని గ్లో పెరుగుతుందని ఆమె చెపుతోంది. ఇక బయటకు వెళ్లేముందు చేతులకు భుజానికి మెడకు సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకోవాలని లేదంటే చర్మం కమిలినట్లు ఉంటుందని ఆమె చెపుతోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: