టాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరొకవైపు రాజకీయాలలో చురుకుగ కూడా పాల్గొనేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.


అయితే ఇప్పుడు మరిన్ని అంచనాలు పెంచే విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉండడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ లో సినిమా విడుదల అవుతూ ఉండడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలై ఇప్పటికే మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే  పోస్టర్ విడుదల చేయగా ఈ సినిమాకు భారీ హైప్ ఏర్పడిందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ మరొకసారి ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు.


ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది.ఉస్తాద్ భగత్ సింగ్ నుండి సరికొత్త గ్లింప్స్ అభిమానులను ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. మే 11వ తేదీన ఈ సినిమా నుండి ఈ అప్డేట్ రాబోతున్నట్టు సమాచారం. అయితే ఆరోజే  అప్డేట్ ఎందుకనే విషయానికి వస్తే.. హరి శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ సినిమా మే 11న విడుదలైంది. అదే రోజున గ్లింప్స్ రిలీజ్ చేసి ఒక సెండ్ చేసిన క్రియేట్ చేయాలని గట్టి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో ఎలాంటి లెక్కలు తిరగ రాస్తారు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ గారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరెకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: