
కానీ దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన కీర్తి సురేష్ కు మాత్రం ఆ సినిమాతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే దసరా హిట్ తర్వాత కీర్తి సురేష్ కి ఒక్క ఆఫర్ కూడా రాలేదు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు కీర్తి సురేష్ కు అందం అభినయం అంతకుమించిన టాలెంట్ ఉన్న డైరెక్టర్లు ఎవరూ కూడా కీర్తి సురేష్ వైపు చూడట్లేదు. గతంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్స్ తో రొమాన్స్ చేసిన.. నానీతో వరుసగా హిట్స్ కొట్టిన కీర్తికి మాత్రం ఆఫర్లు రావడం లేదు. అయితే కీర్తి సురేష్ మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి లాంటి సినిమాలు చేసి తన ఇమేజ్ను పాడు చేసుకుంది.
ఇటీవల కాలంలో అందరూ హీరోయిన్ల లాగానే సన్నబడి గ్లామర్ షో చేస్తున్న కీర్తిని.. ఏ డైరెక్టర్ పట్టించుకోవడం లేదు. అయితే ప్రస్తుతం కీర్తి సురేష్ అటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో చిరు చెల్లెలి పాత్రలో నటిస్తుంది. ఇది ఒక్కటే ప్రస్తుతం కీర్తి నటిస్తున్న తెలుగు సినిమా. అయితే ఈ ఒక్క సినిమాతో తన కెరీర్ మళ్ళీ ఊపు అందుకుంటుంది అని కీర్తి సురేష్ భారీగానే ఆశలు పెట్టుకుంది. దసరాలో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ కొడితేనే.. ఏ దర్శకుడు పట్టించుకోవట్లేదు. ఇక చెల్లెలి పాత్రలో నటిస్తే ఆఫర్ ఎలా వస్తాయని కొంతమంది సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.