పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్  కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ''బ్రో''

సినిమా ఇస్తున్న అప్డేట్స్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను వినోదయ సీతం అనే తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.. రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే అంచనాలు కూడా భారీగా పెరిగాయి.

తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులను చేసి సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అందులో కూడా ఈ స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ హ్యాండ్ కూడా పడడంతో ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా బాగా హోప్స్ పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి పవర్ స్టార్ ఫస్ట్ లుక్ ను ఆ తర్వాత తేజ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఆ తర్వాత ఈ సినిమా నుండి ఇద్దరినీ కలిపి ఉండే సాలిడ్ పోస్టర్ ను కూడా రివీల్ చేసారు.. దీనికి కూడా ఆడియెన్స్ ను అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఒక్కో పోస్టర్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ను తేవడంతో ఈ సినిమాపై మరిన్ని హోప్స్ పెరిగాయి.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పుడొక క్రేజీ న్యూస్ నెట్టింట  బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో పవన్ వింటేజ్ ట్యూన్స్ ను మిక్స్ చేస్తున్నాడని ఇప్పటికే వార్తలు కూడా బయటకు వచ్చాయి.. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఒక సాంగ్ కోసం పవన్ నటించిన గుడుంబా శంకర్ సినిమా నుండి కిళ్లీ కిళ్లీ సాంగ్ లోని బీట్ ను థమన్ బ్రో సినిమాలో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.ఇదే నిజమైతే పవన్ ఫ్యాన్స్ కు మరింత పండగే…

మరింత సమాచారం తెలుసుకోండి: