ప్రతి సంవత్సరం దసరా పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాల సందడి మొదలవుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా దసరా పండక్కి అద్భుతమైన క్రేజ్ ఉన్న మూడు సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదలకు రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

లియో : తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ప్రస్తుతం లియో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. త్రిష హీరోయిన్ గా రూపొందుతున్న ఈ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు.

భగవంతు కేసరి : నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ లీల ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

టైగర్ నాగేశ్వరరావు : మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను అక్టోబర్ 20 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో రవితేజ ఒక దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

ఇలా ఈ మూడు భారీ క్రేజ్ ఉన్న సినిమాలు ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: