ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అనేక క్రేజీ మూవీ లో షూటింగ్ దశలో ఉన్నాయి. అవి ఏవి ... ప్రస్తుతం ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

గేమ్ చేంజర్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా శంకర్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ లో అంజలి , సునీల్ , శ్రీకాంత్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ రామ్ చరణ్ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

ప్రాజెక్ట్ కే : ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... నాగ్ అశ్విన్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో అమితా బచ్చన్ , దిశా పటాని , కీలక పాత్రలలో కనిపించనుండగా ... కమల్ హాసన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం ప్రభాస్ ... దీపిక పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

దేవర : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గ నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శంషాబాద్ లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం ఎన్టీఆర్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

ఓ జి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సుజిత్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్న వారిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: