టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలు అయినటువంటి బాలకృష్ణ ... ఎన్టీఆర్ ... రామ్ పోతినేని లకు సంబంధించిన మూవీ ల షూటింగ్ లు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి . ప్రస్తుతం వీరు నటిస్తున్న మూవీ లకు సంబంధించిన షూటింగ్ లు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి . ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఎలాంటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అనే విషయాలను తెలుసు కుందాం.

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం భగవంతు కేసరి సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు . శ్రీ లీల ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో బాలకృష్ణ ... శ్రీ లీల పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గ నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో జూనియర్ ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

టాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న డబల్ ఈస్మార్ట్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ రామ్ పోతినేని పై ముంబై లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: