జైలర్ హిట్ కంటే ముందు రజినీకాంత్ కి చాలానే ఫ్లాపులు వచ్చాయి.. ఈ ఏడాది మొదటిలో చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.. ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన చిరంజీవి స్థాయి తగ్గదని తెలియజేశారు.. చిరంజీవి వచ్చిన తరువాతే తెలుగు సినిమా పద్ధతి పూర్తిగా మారిందని డాన్స్ నుంచి ఫైట్స్ వరకు ప్రతిదీలో కూడా చిరంజీవి ఒక ట్రెండ్ సెట్ చేశారని తెలిపారు..
విక్రమ్ తో మొన్న కమలహాసన్ జైలర్ తో నేడు రజినీకాంత్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టే చిరంజీవి కూడా ఇస్తారని తెలియజేశారు విజయ్ దేవరకొండ.. అలా చిరు, రజిని, కమల్ వంటి సీనియర్ స్టార్స్ ఒక స్టాండర్డ్స్ సెట్ చేసి లెజెండ్స్ గా నిలిచారు.. ఒక్క సినిమా రిజల్ట్ చూసి ఎవరిని తక్కువ అంచనా చేయకూడదని తెలిపారు. సెప్టెంబర్ 1న ఖుషి సినిమా విడుదల కాబోతోంది. అయితే ఈ విషయాన్ని కొంతమంది అభిమానులు సైతం తప్పుగా అర్థం చేసుకున్నారు తనను తాను రజినీకాంత్ తో లేదా చిరంజీవితో ఎప్పుడు పోల్చుకోలేదని వారు సూపర్ స్టార్ లని హిట్ ఫ్లాపులతో సంబంధం లేదని వారికి ఎప్పుడు స్టార్ట్ అవ్వడం అనేది ఉంటుందని కూడా తెలియజేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి