కెరీర్ బిగినింగ్ లో మాత్రం ఈ భామ కొన్ని వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.. కాని వాటి ద్వారా పెద్దగా గుర్తింపురాలేదు. అయితే షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి చేసిన సాఫ్ట్వేర్ డెవలపర్స్ వెబ్ సిరీస్ కు మాత్రం భారీ రెస్పాన్స్ సాధించింది. అప్పటి నుంచి ఆమెకు క్రేజ్ పెరిగింది.
ఈవెబ్ సిరీస్ తరువాత వైష్ణవికి సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి.అయితే హీరోయిన్ గా ఛాన్స్ మాత్రం రాలేదు. సినిమాల్లో చెల్లి పాత్రల్లో ఈ భామకి అవకాశాలు వచ్చాయి.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెల్లి గా అల వైకుంటపురంలో సినిమాలో నటించింది వైష్ణవి. ఆతరువాత నాగశౌర్యతో వరుడు కావలెను అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసింది.ఇలా చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతున్న వైష్ణవి చైతన్యకు సాయిరాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఏదో చిన్న సినిమాగా స్టార్ట్ అయిన బేబీ.. టాీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బేబీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయింది.
అయితే ఆ మధ్యకాలంలో వైష్ణవి చైతన్య ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయిలో ఉండే క్వాలిటీస్ గురించి చెప్పింది. వైష్ణవి చైతన్య ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు కాబోయే భర్త పై భారీ అంచనాలు ఏమీ పెట్టుకోవడం లేదు.ఆస్తిపాస్తులు ఏమీ లేకున్నా,అందచందమేమీ లేకపోయినా నాకు పరవాలేదు. మంచి మనసు ఉంటే చాలు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి