టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే కి గత కొంతకాలంగా బ్యాడ్ టైం నడుస్తోంది. గత కొంతకాలంగా వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న ఈమెకి దురదృష్టమే ఎదురవుతోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈమె నటిస్తున్న సినిమాలన్నీ కూడా బోల్తాపడుతున్నాయి. దాంతో ఇప్పుడు పూజా హెగ్డే ని ఐరన్ లెగ్ అని అంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినప్పటికి ఆ సినిమాలన్నీ కూడా ఫ్లాప్ టాక్ను అందుకున్నాయి. దాంతో ఇప్పుడు పూజ హెగ్డే కి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.అయితే ఈలోపు మహేష్ బాబుకి జోడిగా మరొకసారి అద్భుతమైన ఛాన్స్ వచ్చింది.

గుంటూరు కారం సినిమాలో పూజ హెగ్డే ని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. కానీ ఆమె ప్రభావమా లేక ఇంకేదో తెలియదు కానీ ఈ సినిమా షూటింగ్ కూడా సరిగ్గా చేయలేదు. పూజ అదే సమయంలో తన కాలు విరగడం మహేష్ బాబు ఫ్యామిలీల విషాదాలు టూర్లు ఇలా రకరకాల కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ చాలావరకు డిలే అవుతూ వచ్చింది. ముందుగా పూజ హెగ్డే ఇచ్చిన డేట్స్ అయిపోయాయి దాని తర్వాత ఆమె తన డేట్స్ను సర్దుబాటు చేసుకోలేకపోయింది. అందువలన ఈ సినిమా నుండి పూజ ను తప్పుకుంది. దాంతో పూజని ఈ సినిమా నుండి తీసేసారు అన్న వార్తలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 అయితే ఇంత జరుగుతున్నా కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా కొత్త ప్రాజెక్ట్లను వెతుక్కుంటుంది పూజ హెగ్డే .ఈ నేపథ్యంలోనే మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ఒక సినిమాలో పూజ హెగ్డేను హీరోయిన్ గా తీసుకుందామని అల్లు అర్జున్ చెప్పినట్లుగా సమాచారం. జూలై సన్నాఫ్ సత్యమూర్తి అలా వైకుంఠపురంలో వంటి సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్లో మరొకసారి ఇప్పుడు సినిమా రాబోతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే ను తీసుకుందామని స్వయంగా అల్లు అర్జున్ చెప్పినట్లుగా తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన డీజే అలా వైకుంఠపురంలో వంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. అలా ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ముచ్చటగా మూడవసారి సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: